ఆసియా కప్‌ భారత్ గెలవొచ్చు: పాకిస్తాన్ మాజీ కెప్టెన్

ఇస్లామాబాద్: ఆసియా కప్-2022 ట్రోఫీ ఎవరు గెలుస్తారనే విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సోమవారం స్పందించాడు.

Update: 2022-08-15 13:24 GMT

ఇస్లామాబాద్: ఆసియా కప్-2022 ట్రోఫీ ఎవరు గెలుస్తారనే విషయంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ సోమవారం స్పందించాడు. టీమిండియా జట్టు ఆసియా కప్ గెలవొచ్చని చెప్పిన అతను.. ఆటగాళ్లకేమైనా విటమిన్ లోపముందా? అని నవ్వుతూ మాట్లాడారు. టీమ్ ఇండియా జట్టు పటిష్టంగా ఉందని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే ఏడు సార్లు విజేతగా నిలిచిన టీమ్ ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగనుందన్నారు. ఈ సారి ఆసియా కప్ గెలిచే సత్తా టీమ్ ఇండియాకు ఉందని సల్మాన్ బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వెల్లడించాడు. అలాగే ఇతర జట్ల విజయావకాశాలపై బట్ మాట్లాడారు. 'పాకిస్తాన్‌ జట్టు చెలరేగిన రోజు ఎవరినైనా ఓడించగలదు. అఫ్గానిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. బంగ్లాదేశ్ ఒక్కోసారి బాగానే ఆడతుంది. మరికొన్ని సార్లు పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. భారత జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.' అని పేర్కొన్నారు. కాగా, ఈ నెల 27 నుంచి ఆసియా కప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. 28న భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్‌-2021లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News