ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌కు భారత ఆటగాళ్లు ఎంపిక

ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లు నేరుగా ఎంపికయ్యారు.

Update: 2022-09-25 16:43 GMT

న్యూఢిల్లీ: ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ముగ్గురు భారత స్టార్ ఆటగాళ్లు నేరుగా ఎంపికయ్యారు. పంకజ్ అధ్వానీ, సౌరవ్ కొఠారి, ధ్రువ్ సిత్వారా డైరెక్ట్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. అలాగే వీరితోపాటు ధ్వజ్ హరియా, లౌకిస్ పతారే, ఎస్.శ్రీక్రిష్ణన్, రోహన్ జంబూస్రియా భారత్ తరఫున పోటీ చేయనున్నారు. కౌలాలంపూర్ వేదికగా అక్టోబర్ 4-8వ తేదీ వరకు టోర్నమెంట్ జరగనుంది.

ఈ టోర్నీలో మయన్మార్, సింగపూర్, ఇండియా, వియత్నాం, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేషియాతోపాటు ఇతర దేశాల ఆటగాళ్లు తలబడనున్నారు. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత తిరిగి బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం అయ్యాయి. ఈ ఏడాది 150 అప్ పాయింట్ల ఫార్మాంట్‌లో చాంపియన్‌షిప్ పోటీలు జరగనున్నాయి. దీని చివరి ఎడిషన్ 2019లో మయన్మార్‌లో జరిగింది.

Similar News