పట్టుమని పదేళ్లు లేవ్.. అదరగొడ్తున్న సిరిసిల్ల చిన్నోడు.. వీడియో వైరల్!

దిశ, వెబ్‌డెస్క్ : పట్టుమని పదేళ్లు కూడా నిండలేదు. కానీ, ఆ చిన్నోడు చేస్తున్న పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎదిగిన కొడుకులే వ్యవసాయంలో తండ్రికి సాయం చేసేందుకు ముందుకు రాని రోజులివి. అలాంటిది స్కూల్‌కు వెళ్లే బాలుడు బురదలో మట్టిలో దిగి పొలం పనుల్లో తన తండ్రికి సాయంగా నిలిచిన తీరు అందరిచేత మన్ననలు పొందేలా చేస్తుంది. వ్యవసాయం అంటే ఎంటో తెలియని వయస్సులో ఆ చిన్నోడు గొర్రు చేతబట్టి గొర్రు కొడ్తున్న వీడియో ఇప్పుడు […]

Update: 2021-07-10 22:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పట్టుమని పదేళ్లు కూడా నిండలేదు. కానీ, ఆ చిన్నోడు చేస్తున్న పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎదిగిన కొడుకులే వ్యవసాయంలో తండ్రికి సాయం చేసేందుకు ముందుకు రాని రోజులివి. అలాంటిది స్కూల్‌కు వెళ్లే బాలుడు బురదలో మట్టిలో దిగి పొలం పనుల్లో తన తండ్రికి సాయంగా నిలిచిన తీరు అందరిచేత మన్ననలు పొందేలా చేస్తుంది.

వ్యవసాయం అంటే ఎంటో తెలియని వయస్సులో ఆ చిన్నోడు గొర్రు చేతబట్టి గొర్రు కొడ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లికి చెందిన గూడ శ్రీనివాస్ రెడ్డి వెంకట్రావుపల్లిలోని తన కౌలు భూమి వద్దకు కొడుకు శ్రీతన్‌ను తీసుకెళ్లాడు. అయితే, శ్రీతన్ పంట పోలంలోకి దిగి గొర్రు కొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తన కొడుకు గొర్రు కొట్టే వీడియోను తండ్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా శభాష్ చిన్నోడా అని అందరూ మెచ్చుకుంటున్నారు.

Tags:    

Similar News