‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి మా పొట్టకొట్టకండి’

దిశ, యాదగిరిగుట్ట: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి మా పొట్టకొట్టకండి’ అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండకింద ఉన్నటువంటి దుకాణాదారులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. యాదరిగిగుట్ట కింద ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మంచతలపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే ఇండ్లు కోల్పోయామని, ఈ ఫ్లైఓవర్‌తో దుకాణాలు కూడా కోల్పోయి రోడ్డునపడే పరిస్థితి నెలకొంటుందని స్థానిక దుకాణాదారులు గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల కార్లలో […]

Update: 2021-09-16 11:43 GMT

దిశ, యాదగిరిగుట్ట: ‘ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి మా పొట్టకొట్టకండి’ అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట కొండకింద ఉన్నటువంటి దుకాణాదారులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. యాదరిగిగుట్ట కింద ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మంచతలపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే ఇండ్లు కోల్పోయామని, ఈ ఫ్లైఓవర్‌తో దుకాణాలు కూడా కోల్పోయి రోడ్డునపడే పరిస్థితి నెలకొంటుందని స్థానిక దుకాణాదారులు గురువారం సాయంత్రం ఆందోళనకు దిగారు. ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల కార్లలో ఆలయానికి వచ్చే భక్తులు నేరుగా ఫ్లైఓవర్ మీదనుంచే గుట్టమీదకు చేరుకుంటారని, దాంతో తమ ఉపాధికి తీవ్రనష్టం జరుగుతుందని వెల్లడించారు. ఆలయం మీదే ఆధారపడి దుకాణాలు పెట్టుకొని బతుకుతున్నామని, ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల దుకాణాలు దివాలా తీసి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఫ్లైఓవర్ నిర్మాణం నిలిపివేసి, తమ ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఈ ధర్నాలో మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమెందర్, కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, కౌన్సిలర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News