ఓటీటీలపై బాలీవుడ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు.. అవి వాటితో సమానం అంటూ
దిశ, సినిమా: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ.. ఇటీవల ఓ ఇంటర్వూలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్థలు నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో ఇకపై నటించనని ప్రకటించారు. వాళ్లు ఎంచుకునే కంటెంట్ తనకు సంతృప్తి ఇవ్వట్లేదని తెలుపుతూ.. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఓ చెత్త కుప్పలా తయారయ్యాయని స్పష్టం చేశారు. ‘నేను నటించిన షోస్ సదరు ప్లాట్‌ఫామ్స్‌లో మొదటిస్థానాన్ని పొందుతున్నాయి. కానీ ఆ షోలకు అంత […]
దిశ, సినిమా: బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ.. ఇటీవల ఓ ఇంటర్వూలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్ట్రీమింగ్ సంస్థలు నిర్మించే ప్రాజెక్ట్‌ల్లో ఇకపై నటించనని ప్రకటించారు. వాళ్లు ఎంచుకునే కంటెంట్ తనకు సంతృప్తి ఇవ్వట్లేదని తెలుపుతూ.. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఓ చెత్త కుప్పలా తయారయ్యాయని స్పష్టం చేశారు. ‘నేను నటించిన షోస్ సదరు ప్లాట్‌ఫామ్స్‌లో మొదటిస్థానాన్ని పొందుతున్నాయి. కానీ ఆ షోలకు అంత స్థాయి లేదు. వాటికి సంబంధించిన సీక్వెల్స్పైనా ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన సాక్రెడ్ గేమ్స్‌లో నటిస్తున్నప్పుడు కొత్త టాలెంట్‌కు అవకాశం వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. కానీ ప్రస్తుతం ఓటీటీలు ప్రొడక్షన్ హౌస్‌లకు ఓ వ్యాపారంలా మారుతున్నాయి. బాలీవుడ్ పెద్ద నిర్మాతలు సైతం ఓటీటీ సంస్థలతో భారీ డీల్స్ కుదుర్చుకుంటున్నారు. డబ్బు ఎక్కువ రావడంతో వాళ్లు కూడా కంటెంట్‌ను అధికంగా ఇస్తున్నారు. దీంతో క్వాలిటీ లేకుండా పోతుంది’ అని నవాజుద్దిన్ వివరించారు.