పాలమూరులో షర్మిలతో నడిచేదెవరు?

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వైఎస్సార్.. ఈ పేరు వింటేనే కొండంత అండ.. గుండెనిండా ధైర్యం.. భారమైన బతుకులకు భరోసా.. కాంగ్రెస్ నాయకులు, అభిమానులే కాదు.. మరెందరి హృదయాల్లో నిలిచిన అభిమాన నేత. ఎక్కడ చూసినా ఆయనకు అభిమానులే… అయితే ఇది గతం. ఆయన మరణానంతరం రాష్ట్ర విభజన జరగడంతో ప్రత్యామ్నాయం లేక కొందరు ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండగా… మరికొందరు అధికార టీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలో చేరిపోయారు. కొంతమంది ఆయా పార్టీల్లో […]

Update: 2021-02-26 14:42 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వైఎస్సార్.. ఈ పేరు వింటేనే కొండంత అండ.. గుండెనిండా ధైర్యం.. భారమైన బతుకులకు భరోసా.. కాంగ్రెస్ నాయకులు, అభిమానులే కాదు.. మరెందరి హృదయాల్లో నిలిచిన అభిమాన నేత. ఎక్కడ చూసినా ఆయనకు అభిమానులే… అయితే ఇది గతం. ఆయన మరణానంతరం రాష్ట్ర విభజన జరగడంతో ప్రత్యామ్నాయం లేక కొందరు ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతుండగా… మరికొందరు అధికార టీఆర్ఎస్, బీజేపీ తదితర పార్టీలో చేరిపోయారు. కొంతమంది ఆయా పార్టీల్లో ప్రధాన నాయకులు గాను మరికొంత మంది ప్రజాప్రతినిధులు గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ తనయ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని నెలకొల్పేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ చర్చ జరుగుతోంది. అయితే ఆ పార్టీ వైపు మొగ్గు చూపే ముఖ్య నాయకులు ఎవరూ ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మాత్రం వైఎస్సార్ తర్వాత ఏ పార్టీలో చేరకుండా మిగిలిపోయారు. అటువంటి వారితో పాటు ప్రస్తుతం ఉన్న పార్టీలలో తగిన ప్రాధాన్యం లభించని వారు, ఒకటి రెండు సామాజిక వర్గాలకు చెందిన యువత షర్మిల పార్టీ వైపు కొంతమేర మొగ్గు చూపే అవకాశం ఉంది. దీనివల్ల ఆయా పార్టీలకు పెద్దగా నష్టం జరిగే అవకాశాలు కూడా ఉండవు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరిస్థితులు ఇలా:

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఇతర పార్టీల పదవుల లో ఉండడం కన్నా అధికార పార్టీలో కనీసం కార్యకర్తగా ఉన్న తమకు పనులు జరుగుతాయనే ఉద్దేశంతో జిల్లా, రాష్ట్ర నేతలతోపాటు, చోటామోటా నాయకులు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. అయితే అధికార టీఆర్ఎస్ పై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. ఇందుకు ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అని భావించిన వారు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రోజురోజుకు ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ముందుకు సాగుతున్నా అంతర్గత కుమ్ములాటలు ఉండడంతో ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు ఉండడం లేదు. ఉమ్మడి జిల్లాలో వామపక్ష పార్టీల ప్రభావం పూర్తిగా తగ్గింది. ఇలాంటి సమయంలో తెలంగాణలో షర్మిల పార్టీని స్థాపిస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

2న ఆత్మీయ సమ్మేళనం..

తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఉద్దేశంలో భాగంగా వైఎస్సార్ తనయ షర్మిల రాష్ట్రంలోని ఆయా జిల్లాల వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వైఎస్సార్ అభిమానులతో మార్చి రెండవ తేదీన సమావేశం నిర్వహించడానికి ఆమె ఆమోదం తెలిపారు. ఉమ్మడి జిల్లా రాజకీయ పరిస్థితులు, వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి , రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్యలు, ప్రత్యేకించి గద్వాల అలంపూర్ నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న జలాల అంశం చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చివరలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలను గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి.

ఆత్మీయ సమ్మేళనానికి సన్నద్ధం ..

ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆత్మీయ సమ్మేళనానికి తరలి వెళ్లేందుకు వైఎస్సార్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు జడ్పీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అభిమానులను తరలించేందుకు చర్చలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News