మఠాలను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి ప్రణబ్

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త విన్న దేశం మూగబోయింది. రాష్ట్రపతి, ప్రధానితో పాటు అందరూ ఇప్పటికే సంతాపం ప్రకటించారు. తాజాగా ప్రణబ్ మరణ వార్త తెలిసిన విశాఖ శాకదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. ప్రణబ్ ముఖర్జీ శివైక్యమవడం పట్ల చింతిస్తున్నానన్నారు. రాజకీయాలతో సమానంగా ఆధ్యాత్మిక చింతనకూ ప్రాధాన్యమిచ్చేవారని తెలిపారు. పీవీ తర్వాత పీఠాలు, మఠాలను ప్రోత్సహించిన మహోన్నత […]

Update: 2020-08-31 11:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మరణ వార్త విన్న దేశం మూగబోయింది. రాష్ట్రపతి, ప్రధానితో పాటు అందరూ ఇప్పటికే సంతాపం ప్రకటించారు. తాజాగా ప్రణబ్ మరణ వార్త తెలిసిన విశాఖ శాకదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు.

ప్రణబ్ ముఖర్జీ శివైక్యమవడం పట్ల చింతిస్తున్నానన్నారు. రాజకీయాలతో సమానంగా ఆధ్యాత్మిక చింతనకూ ప్రాధాన్యమిచ్చేవారని తెలిపారు. పీవీ తర్వాత పీఠాలు, మఠాలను ప్రోత్సహించిన మహోన్నత వ్యక్తి ప్రణబ్ అని కొనియాడారు. హిందూ ధర్మం విశ్వవ్యాప్తం కావాలని ప్రణబ్ పరితపించేవారని చెప్పారు. ప్రణబ్ కుటుంబానికి విశాఖ శారదాపీఠం సానుభూతి ప్రకటిస్తోందని స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు.

Tags:    

Similar News