Heat Waves: వడగాలులతో ద్రవ్యోల్బణానికి రెక్కలు.. కారణం ఇదే..!

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి.

Update: 2024-05-01 09:56 GMT

దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు భానుడు భగభగలాడుతున్నాడు. కొన్ని రాష్ట్రాల్లో అయితే 45, 46 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో పలు నగరాల్లో నిప్పుల కొలిమిలో ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. తమకు ఏదైనా పనులు ఉంటే ఉదయం తొమ్మిది గంటలలోపు పూర్తి చేసుకొని 9 గంటలకల్లా ఇల్లకు చేరుకుంటున్నారు.

క పెరిగిన ఉష్ణోగ్రతతోపాటు వాడగాలులు కూడా వీస్తున్నాయి. అయితే ఈ వడగాలుల వల్ల ద్రవ్యోల్బణానికి రెక్కలు రానున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా వడగాలులు వీస్తున్నాయి. ఈ వడగాలుల కారణంగా వ్యవసాయ దిగుబడి తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ కారణంగా ద్రవవ్యోల్బణం ఈ ఏడాది 30 నుండి 50 బేసిస్ పాయింట్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కాగా ఈ ద్రవ్యోల్బణం జూన్ వరకు ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలానే రైతుల ఆదాయం, ఆహార ద్రవవ్యోల్బణం, ప్రజల ఆరోగ్యంపై కూడా ఈ వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

Similar News