సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో కాల్పులు జరిపిన నిందితుడు జైలులో ఆత్మహత్య

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.

Update: 2024-05-01 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.  ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం నిందితులను వెంటనే పట్టుకోవాలని సూచించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన తర్వాత జైలుకు తరలించారు. కాగా ఈ రోజు ఆ ఇద్దరిలో అనుజ్ థాపన్ అనే నిందితుడు.. పోలీసుల కస్టడిలో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన పోలీసులు హుటాహుటిన అతన్ని స్థానికం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా అతను అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 

Similar News