ఆంధ్రప్రదేశ్‌లో సీతమ్మ విగ్రహం ధ్వంసం

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం రామతీర్థంలో రాముడి విగ్రహం తలనరికిన ఘటన మరువక ముందే మరోచోట సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని సీతారామమందిరంలో సీత విగ్రహం ధ్వంసం అయ్యింది. అయితే విగ్రహాన్ని ఎవరైనా కావాలనే ధ్వంసం చేశారా లేకుంటే గాలికి కింద పడిపోయిందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఆలయానికి చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. అయితే సీతమ్మ విగ్రహం గాలికైనా పడి ఉండొచ్చు […]

Update: 2021-01-03 02:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం రామతీర్థంలో రాముడి విగ్రహం తలనరికిన ఘటన మరువక ముందే మరోచోట సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని సీతారామమందిరంలో సీత విగ్రహం ధ్వంసం అయ్యింది. అయితే విగ్రహాన్ని ఎవరైనా కావాలనే ధ్వంసం చేశారా లేకుంటే గాలికి కింద పడిపోయిందా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఆలయానికి చేరుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. అయితే సీతమ్మ విగ్రహం గాలికైనా పడి ఉండొచ్చు లేకుంటే ఎలుకలైనా పడేయవచ్చు అని సీఐ చెప్పడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆలయం వద్దకు చేరుకున్న టీడీపీ లీడర్ పట్టాభిరామ్ సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహం తలనరికిన ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శనివారం ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఓవైపు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న సమయంలోనే విజయవాడ నడిబొడ్డున సీతమ్మ విగ్రహం ధ్వంసం అవ్వడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

Tags:    

Similar News