సాయి పల్లవి ‘సారంగ దరియా’.. ఫాస్టెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్

దిశ, సినిమా: జానపద గీతాలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అవే గీతాలను సినిమా కోసం రీక్రియేట్ చేస్తే రికార్డుల మోత మోగిస్తాయి. ఇక అలాంటి పాటకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ స్టెప్స్ యాడ్ అయితే, రికార్డులకే ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ‘లవ్ స్టోరి’ సినిమా కోసం మాస్ అండ్ ఎనర్జిటిక్ ఫోక్ నంబర్ ‘సారంగ దరియా’ను రీమిక్స్ చేయగా.. లిరికల్ సాంగ్ రిలీజైన రోజు నుంచే […]

Update: 2021-03-14 08:13 GMT

దిశ, సినిమా: జానపద గీతాలకు ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అవే గీతాలను సినిమా కోసం రీక్రియేట్ చేస్తే రికార్డుల మోత మోగిస్తాయి. ఇక అలాంటి పాటకు సాయి పల్లవి లాంటి హీరోయిన్ స్టెప్స్ యాడ్ అయితే, రికార్డులకే ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ‘లవ్ స్టోరి’ సినిమా కోసం మాస్ అండ్ ఎనర్జిటిక్ ఫోక్ నంబర్ ‘సారంగ దరియా’ను రీమిక్స్ చేయగా.. లిరికల్ సాంగ్ రిలీజైన రోజు నుంచే దుమ్ములేపుతోంది. తాజాగా అన్ని రికార్డ్స్‌ను బ్రేక్ చేస్తూ.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలో 50 మిలియన్ వ్యూస్ సాధించిన ఫాస్టెస్ట్ సాంగ్‌గా నిలిచింది. ‘లవ్ స్టోరి’ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకులు కాగా.. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించిన పాటను మంగ్లీ పాడారు.

https://twitter.com/SVCLLP/status/1371044727877816326?s=20

Tags:    

Similar News