కాంగ్రెస్ కు ఓటేస్తే.. 55 శాతం వారసత్వ పన్ను కట్టాలి- ప్రధాని మోడీ

కాంగ్రెస్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ. తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలోమోడీ ప్రసంగించారు.

Update: 2024-04-30 18:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని మోడీ. తెలంగాణలోని మెదక్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలోమోడీ ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను అమలు చేస్తుందని మండిపడ్డారు. వారసత్వ పన్ను కింద 55 శాతం ఆస్తిని స్వాధీనం చేసుకుని ఇతరులకు పంచుతుందని కాంగ్రెస్ నేతలే స్వయంగా చెప్పారని ఆరోపించారు.

అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉందన్న వారసత్వ పన్నును ఇంట్రెస్టింగ్ ఐడియాగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా కామెంట్స్ చేశారు. వాటి ఆధారంగానే మోడీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉన్నా.. దానికి ఐదు ఎజెండాలు అని అన్నారు. తప్పుడు వాగ్ధానాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మాఫియకు, నేరస్థులకు మద్దతు ఇవ్వడం, కుటుంబరాజకీయాలు, అవినీతి అని అన్నారు. ఇవే కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ అని.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ఆర్ పన్ను గురించే చర్చ జరుగుతోందన్నారు. రేవంత్ రెడ్డి పన్ను గురించే తెలంగాణలో చర్చ జరుగుతోందన్నారు. ఆర్ఆర్ పన్నుకు చరమగీతం పాడకుంటే అది మిమ్మల్ని ఆర్థికంగా నాశనం చేస్తుందని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మోడీ.


Similar News