రౌడీ బేబీ లేకుండానే బిలియన్ పోస్టర్

దిశ, వెబ్‌డెస్క్: ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘మారి 2’ అంతగా సక్సె్స్ కాకపోయినా, ఈ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట మాత్రం రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ పాటలో ధనుష్‌తో పోటీపడి మరీ స్టెప్పులేసిన సాయి పల్లవికి సినీ అభిమానులంతా ఫిదా అయిపోయారు కూడా. ఇటీవలే యూట్యూబ్‌లోనూ బిలియన్ వ్యూస్ సంపాదించి, తొలి సౌత్ ఇండియన్ సినిమా పాటగా రికార్డ్ సృష్టించింది. కాగా ఈ పాటకు బిలియన్ వ్యూస్ రావడం […]

Update: 2020-11-20 00:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘మారి 2’ అంతగా సక్సె్స్ కాకపోయినా, ఈ సినిమాలోని ‘రౌడీ బేబీ’ పాట మాత్రం రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ పాటలో ధనుష్‌తో పోటీపడి మరీ స్టెప్పులేసిన సాయి పల్లవికి సినీ అభిమానులంతా ఫిదా అయిపోయారు కూడా. ఇటీవలే యూట్యూబ్‌లోనూ బిలియన్ వ్యూస్ సంపాదించి, తొలి సౌత్ ఇండియన్ సినిమా పాటగా రికార్డ్ సృష్టించింది. కాగా ఈ పాటకు బిలియన్ వ్యూస్ రావడం పట్ల ఫుల్ ఖుషీగా ఉన్న మూవీ యూనిట్.. బిలియన్ వ్యూస్ పోస్టర్‌ను విడుదల చేసింది. అధికారికంగా విడుదలైన ఈ పోస్టర్ సాయి పల్లవి అభిమానులను హర్ట్ చేసింది. ఎందుకంటే.. ఆ పాటలో ధనుష్‌కు ఎంత క్రెడిట్ వచ్చిందో, సాయి పల్లవి కూడా అంతే క్రెడిట్ దక్కాలి. కానీ రౌడీ బేబీ హిట్‌ సక్సెస్ పూర్తిగా ధనుష్‌దే అన్నట్లుగా బిలియన్ పోస్టర్ విడుదలైంది. దాంతో ఇది అన్యాయమని, సాయిపల్లవికి కూడా సక్సెస్ క్రెడిట్ ఇవ్వాలని, అసలు రౌడీ బేబీ అంటేనే సాయిపల్లవి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తూ, మీమ్స్ కూడా రూపొందిస్తున్నారు. మరి ఆ చిత్ర యూనిట్ నెటిజన్ల కామెంట్లకు స్పందించి, మరో పోస్టర్ రిలీజ్ చేస్తుందో లేదో వేచి చూడాలి.

Tags:    

Similar News