RRR సినిమాపై ఆదివాసీల ఆగ్రహం 

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న RRR సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా బృందం ఇటీవలె కొమురం భీమ్ పాత్రకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది. కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రదర్శించారు. కాగా టీజర్ చివరిలో కొమురం భీమ్ ముస్లిం టోపీ తొడిగినట్టు చూపించడం వివాదాలకు తెరలేపింది. కొమురం భీమ్ ముస్లిం టోపీ తొడిగినట్టు చూపించడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో RRR మూవీ యూనిట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నిజాం నిరంకుశ పాలనకు […]

Update: 2020-10-24 05:10 GMT

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న RRR సినిమాను వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా బృందం ఇటీవలె కొమురం భీమ్ పాత్రకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది. కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ అద్భుతమైన నటన ప్రదర్శించారు. కాగా టీజర్ చివరిలో కొమురం భీమ్ ముస్లిం టోపీ తొడిగినట్టు చూపించడం వివాదాలకు తెరలేపింది.

కొమురం భీమ్ ముస్లిం టోపీ తొడిగినట్టు చూపించడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో RRR మూవీ యూనిట్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడికి టోపి పెట్టడం ఏంటని భీమ్ యువసేన నేతలు నిలదీశారు.ఆదివాసీల మనోభావాలు దెబ్బ తినేలా సినిమాలు తీస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పారు. ఆయన చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే సినిమా తీయాలని సూచించారు. టోపీ సన్నివేశాలను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Tags:    

Similar News