కార్తీక్, సారా కాంబినేషన్ ది బెస్ట్..

           కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్… ఈ ఇద్దరు బాలీవుడ్ యంగ్ స్టర్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాఫీ విత్ కరణ్ షోలో సారా .. కార్తీక్ ఆర్యన్ అంటే క్రష్ ఉందని తెలపడంతో ఈ రూమర్లకు తెరతీసింది. ఇప్పుడు వీరిద్దరు లవ్ ఆజ్ కల్ సినిమాలో కలిసి నటించారు. శుక్రవారం విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.            అయితే షారుక్ […]

Update: 2020-02-06 08:59 GMT

కార్తీక్ ఆర్యన్, సారా అలీఖాన్… ఈ ఇద్దరు బాలీవుడ్ యంగ్ స్టర్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాఫీ విత్ కరణ్ షోలో సారా .. కార్తీక్ ఆర్యన్ అంటే క్రష్ ఉందని తెలపడంతో ఈ రూమర్లకు తెరతీసింది. ఇప్పుడు వీరిద్దరు లవ్ ఆజ్ కల్ సినిమాలో కలిసి నటించారు. శుక్రవారం విడుదల కాబోతున్న సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

అయితే షారుక్ ఖాన్, దీపికా పదుకొణెల సూపర్ హిట్ మూవీ చెన్నై ఎక్స్ ప్రెస్ డైరెక్టర్ రోహిత్ శెట్టి వీరిద్దరి గురించి ఇంట్రెస్ట్ కామెంట్స్ చేశారు. కామిక్ యాంగిల్ లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ బ్లాక్ బస్టర్ కాగా.. సినిమా సీక్వెల్ ప్లాన్ చేస్తే … కార్తీక్, సారాలను ఎంచుకుంటానని తెలిపాడు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంటుందని.. కామెడీ బాగా పండుతుందని చెప్పాడు. కాగా… రోహిత్ శెట్టి డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న సూర్యవంశీ చిత్రం మార్చి 27న విడుదల కానుంది.

Tags:    

Similar News