గతంలో కూడా ఈ కంపెనీలో విషాదం: సీపీ

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీకేజీ ఘటనపై కేసు నమోదు చేశామని విశాఖపట్టణం సీపీ ఆర్కే మీనా తెలిపారు. ప్రమాద ఘటన సమాచారం తెలియగానే సంఘటనా స్థలికి చేరుకున్నామని ఆయన చెప్పారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నైట్ షిఫ్ట్ ఇన్ చార్జ్ నరేంద్ర, విజయనగరానికి చెందిన కెమిస్ట్ గౌరీ శంకర్ మృతి చెందారని చెప్పారు. మరో […]

Update: 2020-06-29 21:54 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామిక వాడ పరవాడలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో చోటుచేసుకున్న హైడ్రోజన్ సల్ఫైట్ గ్యాస్ లీకేజీ ఘటనపై కేసు నమోదు చేశామని విశాఖపట్టణం సీపీ ఆర్కే మీనా తెలిపారు. ప్రమాద ఘటన సమాచారం తెలియగానే సంఘటనా స్థలికి చేరుకున్నామని ఆయన చెప్పారు. ఈ ఘటనలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నైట్ షిఫ్ట్ ఇన్ చార్జ్ నరేంద్ర, విజయనగరానికి చెందిన కెమిస్ట్ గౌరీ శంకర్ మృతి చెందారని చెప్పారు. మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిని ఆర్కే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామని చెప్పిన ఆర్కే మీనా.. మూడేళ్ల కిందట ఇదే కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించిందని గుర్తు చేశారు. అప్పట్లో ఇద్దరు మృతి చెందారని ఆయన అన్నారు. ఆ ప్రమాదంపై కూడా విచారణ చేస్తున్నామని సీపీ వెల్లడించారు.

Tags:    

Similar News