ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రాజెక్టులు: మంత్రి హరీశ్

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై అధికారులతో సోమవారం మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. చందలాపూర్ రంగనాయకసాగర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో మాట్లాడారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కాలువలు, పిల్ల కాలువల కోసం భూ సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, ఇంజినీర్లు ప్లాన్ చేసి ప్రాజెక్టులు నిర్మిస్తే నీటి వనరులు శాశ్వతంగా లభిస్తాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ […]

Update: 2020-04-20 04:19 GMT

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై అధికారులతో సోమవారం మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. చందలాపూర్ రంగనాయకసాగర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఆ శాఖ అధికారులతో మాట్లాడారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కాలువలు, పిల్ల కాలువల కోసం భూ సేకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని, ఇంజినీర్లు ప్లాన్ చేసి ప్రాజెక్టులు నిర్మిస్తే నీటి వనరులు శాశ్వతంగా లభిస్తాయని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు పనిచేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.

tag: Review, Minister Harish Rao, Irrigation Officers, siddipet

Tags:    

Similar News