కేసీఆర్, కేటీఆర్ అనుమతితోనే వామన్ రావు హత్య : ఆధారాలివే

దిశ,వెబ్‌డెస్క్: వామన్‌రావు దంపతుల హత్యకేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంట శ్రీను, చిరంజీవిలు పథకం ప్రకారం హత్యచేసినట్లు తేలింది. హత్య తరువాత రామగిరి నుంచి మహరాష్ట్ర పరారయ్యారు. సుందిళ్ల బ్యారేజీలు కత్తులు పడేసి వెళ్లారు నిందితులు. అక్కడే బట్టలు మార్చుకొని పరారయ్యాడు కుంటా శ్రీను. ఇక రిమాండ్ రిపోర్ట్ లో కుంట శ్రీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు అయితే ఈ నేపథ్యంలో వామన్ రావు దంపతుల హత్య […]

Update: 2021-02-22 06:10 GMT

దిశ,వెబ్‌డెస్క్: వామన్‌రావు దంపతుల హత్యకేసు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుంట శ్రీను, చిరంజీవిలు పథకం ప్రకారం హత్యచేసినట్లు తేలింది. హత్య తరువాత రామగిరి నుంచి మహరాష్ట్ర పరారయ్యారు. సుందిళ్ల బ్యారేజీలు కత్తులు పడేసి వెళ్లారు నిందితులు. అక్కడే బట్టలు మార్చుకొని పరారయ్యాడు కుంటా శ్రీను. ఇక రిమాండ్ రిపోర్ట్ లో కుంట శ్రీను, లచ్చయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు అయితే ఈ నేపథ్యంలో వామన్ రావు దంపతుల హత్య సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అనుమతితోనే జరిగిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అందుకు సంబంధించిన కారణాల్ని ఆయన మీడియాకు వివరించారు.

వామన్ రావు హత్యపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

♦నల్లగొండ జిల్లా హాలియా సభలో టీఆర్ఎస్ ను ఎదిరించిన వాళ్లను తొక్కేస్తాం. నలిపేస్తాం. నశం లెక్క పిండి పిండి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ ఉరికించి కొడతామని, చెన్నూర్ లో బాల్కా సుమన్ డైరెక్ట్ గా నరికేయండన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

♦వామన్ రావు హత్యకేసులో ఓ మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్న రేవంత్.., రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆదేశాలిస్తే మండల పార్టీ అధ్యక్షుడు అమలు చేశారన్నారు.

♦ మేం ఏదైనా చేస్తే మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు నీకేమైందని అంటారు. మీరు పోయి నరికేయండి’ అంటూ బాల్కా సుమన్ వ్యాఖ్యల్ని స్పూర్తిగా తీసుకొని నిందితులు వామన్ రావు దంపతుల్ని హత్య చేసినట్లు చెప్పారు.

మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో రామగిరి ఐరన్ తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ వేలాది లారీల ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. కాళేశ్వరం భూసేకరణలో తప్పిదాలు జరిగాయి. ఇవన్నీ మండల స్థాయి నాయకుడు, నియోజక వర్గ స్థాయి చేసే నేరాలు కావన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్రస్థాయిలో ఉన్న పెద్దల ఆశీస్సులు ఉంటే తప్ప.., ఇలాంటి ఐరన్ తవ్వకాలు, ఇసుక రవాణా, భూసేకరణ, లేదంటే నిధులు దుర్వినియోగం కాదన్నారు. ఇన్ని జరుగుతున్నా పార్టీ నేతలపై చర్యలు తీసుకోకపోవడం వల్ల నేరస్తుల్ని ప్రోత్సహించినట్లైందన్నారు రేవంత్ రెడ్డి.

పోలీస్ అధికారులు సైతం ప్రభుత్వం చెప్పు చేతల్లో పని చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ముఖ్యమంత్రే చంపేయండని ఆదేశించిన తరువాత శ్రేణులు చంపడానికి వెళ్తే పోలీసులు ఎలా అడ్డుకుంటారని అన్నారు. వామన్ రావు ఇదే విషయాన్ని చెప్పినట్లు గుర్తు చేశారు. వారం రోజుల క్రితం తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా 17కేసులు వేసినట్లు, అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తున్న తనని చంపుతారని, కాబట్టి తాను మంథని నుంచి హైదరాబాద్ వెళ్లే వరకూ రక్షణ కల్పించాలని కమిషనర్ ను కోరినట్లు రేవంత్ గుర్తు చేశారు. కానీ వామన్ రావు ఫోన్ చేస్తే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Tags:    

Similar News