చీర కట్టుకున్నందుకు ‘ఆమె’కు ఘోర అవమానం.. వీడియోపై నెటిజన్లు ఫైర్

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ సంప్రదాయంలో చీరకట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. విదేశీ మహిళలు కూడా చీరకట్టులో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటిది మనదేశంలోనే కొందరు చీరకట్టును అవమానించేలా వ్యవహరించిన ఘటన సంచలనంగా మారింది. ఢిల్లీలో చీర కట్టుకుని రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ మహిళకు.. చేదు అనుభవం ఎదురైంది. చీర కట్టుకుందని సదరు మహిళను రెస్టారెంట్‌లోని అనుమతించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ మాల్‌లో ఉన్న రెస్టారెంట్‌కు […]

Update: 2021-09-23 02:01 GMT

దిశ, వెబ్‌డెస్క్ : భారతీయ సంప్రదాయంలో చీరకట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. విదేశీ మహిళలు కూడా చీరకట్టులో కనిపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటిది మనదేశంలోనే కొందరు చీరకట్టును అవమానించేలా వ్యవహరించిన ఘటన సంచలనంగా మారింది. ఢిల్లీలో చీర కట్టుకుని రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ మహిళకు.. చేదు అనుభవం ఎదురైంది.

చీర కట్టుకుందని సదరు మహిళను రెస్టారెంట్‌లోని అనుమతించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ మాల్‌లో ఉన్న రెస్టారెంట్‌కు చీరకట్టులో వచ్చిన తనను అక్కడి సిబ్బంది లోనికి రానీయకుండా అడ్డుకున్నట్టుగా మహిళ చెప్పారు. చీర స్మార్ట్, క్యాజువల్‌ డ్రెస్ కోడ్ కిందకు రాదని సిబ్బంది తనతో అన్నట్టుగా ఆమె పేర్కొన్నారు.

ఈ ఘటనతో విసుగు చెందిన జర్నలిస్ట్ అనిత చౌదరి ఆ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘అక్విలా రెస్టారెంట్‌లోనికి చీర కట్టుతో ఉన్న మహిళను లోపలికి అనుమతించలేదు. ఎందుకంటే చీర అనేది స్మార్ట్ ఔట్ ఫిట్ కాదని వారు చెప్పారు. దయచేసి నాకు Smart outfit అర్థం చెప్పండి’ అని అనిత చౌదరి ట్వీట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News