రేవంత్ హామీలతో మరింత అప్పుల్లోకి తెలంగాణ: మాజీ మంత్రి ఈటల

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్

Update: 2024-05-25 10:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెంలో ఈటల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలతో ఇప్పటికే అప్పుల్లో ఉన్న తెలంగాణను మరింత అప్పుల పాలు చేస్తాయని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యతిరేకతతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక కాదని, పాలకపక్షంలో మోకిరిల్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గ్రాడ్యుయేట్స్ ప్రధాని మోడీ నాయకత్వానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఈటల ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలోనూ బీజేపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Similar News