రిలయన్స్ పునర్వ్యవస్థీకరణకు వాటాదారుల ఆమోదం

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంస్థలోని వాటాదారులు, రుణదాతలు ఆమోదం తెలిపారని శుక్రవారం వెల్లడించింది. రిలయన్స్ ఆయిల్‌ టూ కెమికల్స్‌ (ఓ2సీ) విభాగాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మాతృసంస్థ నుంచి ఆయిల్ టూ కెమికల్ వ్యాపారాలను స్వతంత్ర విభాగంగా చేసేందుకు వాటాదారులు, రుణదాతల నుంచి ఆమోదం లభించిందని, నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాలను అనుసరించి వర్చువల్ సమావేశం నిర్వహించినట్టు […]

Update: 2021-04-02 09:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) పునర్వ్యవస్థీకరణలో భాగంగా సంస్థలోని వాటాదారులు, రుణదాతలు ఆమోదం తెలిపారని శుక్రవారం వెల్లడించింది. రిలయన్స్ ఆయిల్‌ టూ కెమికల్స్‌ (ఓ2సీ) విభాగాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మాతృసంస్థ నుంచి ఆయిల్ టూ కెమికల్ వ్యాపారాలను స్వతంత్ర విభాగంగా చేసేందుకు వాటాదారులు, రుణదాతల నుంచి ఆమోదం లభించిందని, నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఆదేశాలను అనుసరించి వర్చువల్ సమావేశం నిర్వహించినట్టు రిలయన్స్ పేర్కొంది.

ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో 99.99 శాతం మంది ప్రత్యేక యూనిట్‌గా విభజించేందుకు అనుకూలంగా ఉన్నట్టు స్పష్టం చేశారని స్టాక్ ఎక్స్ఛేంజీలకు నివేదించింది. కాగా, వాటాదారులు, రుణదాతలతో జరిగిన ఈ వర్చువల్ సమావేశం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ అధ్యకతన జరిగినట్టు రిలయన్స్ సంస్థ వెల్లడించింది.

Tags:    

Similar News