అమలు చేయాల్సిందే : రాజస్థాన్ స్పీకర్

           రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ‘సీఏఏ’ అమలును వ్యతిరేకించగా.. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి మాత్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. శుక్రవారం ఉదయ్‌పూర్‌లోని ఓ కళాశాలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సీఏఏకు మద్దతివ్వడాన్ని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా స్వాగతించారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీకే చెందిన కపిల్ సిబల్ సైతం సీఏఏకు మద్దతుగా మాట్లాడారు. అయితే […]

Update: 2020-02-09 07:40 GMT

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ‘సీఏఏ’ అమలును వ్యతిరేకించగా.. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి మాత్రం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. శుక్రవారం ఉదయ్‌పూర్‌లోని ఓ కళాశాలలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సీఏఏకు మద్దతివ్వడాన్ని రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీష్ పూనియా స్వాగతించారు. గత నెలలో కాంగ్రెస్ పార్టీకే చెందిన కపిల్ సిబల్ సైతం సీఏఏకు మద్దతుగా మాట్లాడారు. అయితే ఇప్పటికే రాజస్థాన్, కేరళ, పంజాబ్, బెంగాల్‌ రాష్ట్రాలు సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News