Politics: బీజేపీకి ఓటేయడం మంచిది.. కాంగ్రేస్ చీఫ్..

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల గురించిన చర్చ జరుగుతోంది.

Update: 2024-05-02 04:56 GMT

దిశ వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎన్నికల గురించిన చర్చ జరుగుతోంది. కాగా రానున్న ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు పొత్తు పెట్టుకోని మరోవైపు పొత్తు పార్టీలను ప్రత్యర్థులుగా చూస్తూ విమర్శలు కురిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు బహరంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థి అధిర్‌ రంజన్‌ చౌదరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూటమిలో భాగమైన టీఎంసీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆయన అన్నారు. కనుక ప్రజలు ఆలోచించి లౌకికవాద శక్తులను గెలిపించాలని కోరారు.

కాంగ్రెస్ వామపక్షాలను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ గెలవకపోతే లౌకికవాదానికి ముప్పు తప్పదని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌లో భాగమైన టీఎంసీకి ఓటు వేసే కంటే బీజేపీకి ఓటు వేయడం మంచిదని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

టీఎంసీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌ కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రస్తుతం చర్చినీయాంసంగా మారింది. కాగా పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై టీఎంసీ ఘాటుగా స్పందించింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీటీంగా పనిచేస్తున్నారని టీఎంసీ మండిపడింది.

ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ చీఫ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. టీఎంసీ కాంగ్రెస్ మిత్రపక్షమని, అలానే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఎవరో ఎడిట్ చేసిన వీడియో అని, పశ్చిమ బెంగాల్ చీఫ్ అలా వ్యాఖ్యానించలేదని కాంగ్రెస్ చెప్పుకొచ్చింది.

Similar News