BREAKING: ఏపీలో కొనసాగుతున్న అల్లర్లు.. కేంద్ర ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసినా ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు.

Update: 2024-05-17 03:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసినా ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. పోలింగ్ సందర్భంగా అనంతపురం, పల్నాడు జిల్లాల్లోని ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది కర్రలు పట్టుకుని బహిరంగంగా దాడులకు తెగబడుతున్నారు. గ్రూపుగా ఉంటూ పరస్పరం రాళ్ల దాడి చేసుకుంటున్నారు. అక్కడక్కడ పెట్రోల్ బాంబులు కూడా పెలిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రెండు జిలాల్లో కొనసాగుతున్న అలర్లను అరికట్టడంలో పోలీసులు విఫలం అయ్యారంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని ఉన్న పోలీసు ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన 15 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర బలగాలను పహారాను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపింది. 

Read More...

ఏపీలో జూన్ 4 తర్వాత కూడా కేంద్ర బలగాలు.. సీఈసీ సంచలన నిర్ణయం

Tags:    

Similar News