మోడీ పర్యటనపై రాహుల్ ‘అబద్దాల’ ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లడఖ్‌లోని నిము సైనిక స్థావరంలో పర్యటించారు. ఈ సందర్భంగా సైనికులకు జాతి తరపున సందేశాన్ని అందించారు. అయితే, దీనిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ‘‘ఓవైపు లడఖ్ వాసులేమో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెబుతున్నారు. ప్రధాని మాత్రం మన భూమిని ఎవరూ తీసుకోలేదంటున్నారు. కచ్చితంగా ఇక్కడెవరో అబద్ధం చెబుతున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కొందరు లడఖ్ వాసుల అభిప్రాయాలను కూడా […]

Update: 2020-07-03 09:26 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం లడఖ్‌లోని నిము సైనిక స్థావరంలో పర్యటించారు. ఈ సందర్భంగా సైనికులకు జాతి తరపున సందేశాన్ని అందించారు. అయితే, దీనిపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ‘‘ఓవైపు లడఖ్ వాసులేమో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని చెబుతున్నారు. ప్రధాని మాత్రం మన భూమిని ఎవరూ తీసుకోలేదంటున్నారు. కచ్చితంగా ఇక్కడెవరో అబద్ధం చెబుతున్నారు’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, కొందరు లడఖ్ వాసుల అభిప్రాయాలను కూడా ఓ వీడియో ద్వారా అందించారు.

గాల్వన్ లోయలో ఘర్షణలు జరిగినప్పటి నుంచి రాహుల్ గాంధీ ఇదే తరహాలో ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోదీ మాట్లాడుతూ, మన భూభాగం ఎలాంటి దురాక్రమణలకు గురికాలేదన్నారు. ఈ వ్యాఖ్యలను రాహుల్ తప్పుబట్టారు. ఎలాంటి దురాక్రమణలు జరగకపోతే గాల్వన్ లోయలో ఘర్షణలు జరిగి భారత సైనికులు ఎందుకు చనిపోయారని మోదీని ప్రశ్నించారు.

Tags:    

Similar News