ఛీ..ఛీ చంకలోని చెమటతో తయారుచేసిన ఫుడ్‌ను ఎగబడి మరీ తింటున్న జనాలు.. ఎక్కడో తెలుసా?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరుగుతున్న వింత సంఘటనలు నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి.

Update: 2024-05-04 13:28 GMT

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో జరుగుతున్న వింత సంఘటనలు నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఒక్కోసారి అలాంటివి చూసిన వారంతా.. షాక్‌కు గురవుతూ ఇలాంటివి కూడా ఉంటాయా? అనే అనుమానంలో పడిపోతుంటారు. తాజాగా, జపాన్‌కు సంబంధించిన వార్త వైరల్ కావడంతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అసలు విషయంలోకి వెళితే.. జపాన్‌లో ఓ ట్రెడిషనల్ డిష్ తయారేచేసే విధానం గురించి తెలిసి అందరూ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఒనిగిరి అనే రైస్ బాల్‌ను అక్కడ తయారు చేసేవారు చంకలో పెట్టుకుని చెమటతో చేస్తున్నారని సమాచారం. జపాన్‌లో ఇది చాలా ఫేమస్ డిష్ అని తెలుస్తోంది. అయితే దీనిని తయారు చేసే మహిళా సిబ్బంది డిష్ ట్రైయాంగిల్ షేప్‌లో రావడానికి చంకలో పెట్టుకుని చెమటతో తయారు చేస్తున్నారట. అయితే.. ఈ మహిళలు పూర్తి హైజీన్​ ప్రొటోకాల్​ని పాటిస్తారట. ఒనిగిరి రైస్​ బాల్స్​ని తయారు చేసేందుకు.. జపాన్​లోని చాలా రెస్టారెంట్స్‌లో ఇదే ప్రాసెస్​‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు.. చాలా రెస్టారెంట్లు.. ఈ ప్రాసెస్​ని బహిరంగంగా కూడా ప్రదర్శిస్తున్నాయి. ఇదేదో యునీక్​ టెక్నిక్​లా ఉందే.. అనుకుంటూ ప్రజలు ఆ ప్రాసెస్​ని ఎగబడి చూస్తున్నారు. సాధారణ ఒనిగిరి ధర కన్నా.. ఇలా చంకలో పెట్టి, చెమటతో తయారు చేస్తున్న డిష్​.. 10 రెట్లు అధిక ధర పలుకుతుండటం గమనార్హం. అలాగే జనాలు కూడా చంకలో పెట్టి తయారుచేసిన రైస్ బాల్స్‌నే ఎగబడి తింటున్నారట. దీనికి సంబంధించిన విషయాలు బయటకు రావడంతో.. అది తెలిసిన వారంతా ఇదేం పైత్యం తయారు చేసే వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే తిన్న వారికి కూడా వచ్చే ప్రమాదం ఉందని మండిపడుతున్నారు. కానీ కొందరు మాత్రం అందులో తప్పేముంది వారు అన్ని జాగ్రత్తలు తీసుకుని తయారుచేస్తే ఏమీ కాదని అంటున్నారు.

 



Similar News