రైలు టికెట్ కొన్నారా.. అయితే ఈ 6 ప్రయోజనాలని మీరు అస్సలు మిస్ కావద్దు!

సాధారణంగా సుదూర ప్రయాణాలు చేసే వారు రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. రైలు ప్రయాణం సురక్షితమే కాదు.. ఎన్నో సదుపాయాలు ఉంటాయి.

Update: 2024-05-18 07:50 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా సుదూర ప్రయాణాలు చేసే వారు రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. రైలు ప్రయాణం సురక్షితమే కాదు.. ఎన్నో సదుపాయాలు ఉంటాయి. అందుకే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అలాగే రైలు ప్రయాణం చేసేవారికి చాలా సదుపాయాలు ఉన్న విషయం చాలా మందికి తెలియదు.. మరి అవేంటో చూసేద్దామా!

1. రైల్ లో ప్రయాణం చేసేవారికి దిండు, బెడ్ షీట్, బ్లాంకెట్ అన్ని Ac 1,2,3 లో ఉచితంగా లభిస్తాయి. గరీబ్ రథ్ లో కూడా ఈ సౌకర్యాలు ఉన్నాయి. ఇందుకోసం మీరు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

2. మీ దగ్గర ధృవీకరించిన రైల్ టికెట్ ఉంటే స్టే చేయడానికి హోటల్ అవసరమైతే మీరు 24 గంటల్లోపు IRCTC డార్మిటరీ ఉపయోగించుకోవచ్చు. అక్కడ మీకు బెడ్ రూ.150 లకే దొరుకుతుంది.

3. మీరు రాజధాని, దురంతో లేదా శతాబ్ది వంటి ప్రీమియం రైల్ లో టికెట్ బుక్ చేసుకున్న 2 గంటల కన్నా ఎక్కువ ఆలస్యం అయితే మీకు IRCTC క్యాంటీన్ నుంచి ఉచితంగా ఆహారం అందిస్తారు. ఒకవేళ అలాంటి సదుపాయం ఇవ్వకపోతే వెంటనే 139 నంబర్ కు డయల్ సంబంధిత అధికారులకు మీరు ఫిర్యాదు చేయవచ్చు.

4. రైల్ ప్రయాణం చేసే సమయంలో మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే 139 కి కాల్ చేస్తే సిబ్బంది ప్రథమ చికిత్స చేస్తారు. ఒకవేళ మీకు కావలసిన సదుపాయం లేకుంటే తర్వాత వచ్చే స్టేషన్ లో చికిత్స చేస్తారు.

5. ప్రతి రైల్వే స్టేషన్ లో లాకర్, క్లోక్ రూమ్ సౌకర్యం ఉంటుంది. మీరు మీ వస్తువులను క్లోక్ రూమ్ లో సుమారు 1 నెల రోజుల పాటు ఉంచుకోవచ్చు. ఇందుకోసం మీరు 24 గంటలకు రూ.50 నుంచి రూ.100 వరకు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ దగ్గర రైలు టికెట్ కచ్చితంగా ఉండాలి.

6. మీరు రైలు దిగిన వెంటనే లేదా ఎక్కే ముందు నాన్ ఏసీ లేదా ఏసీ వెయిటింగ్ రూం లో రెస్ట్ తీసుకునే సదుపాయం ఉంటుంది. ఇందుకోసం మీ వద్ద రైలు టికెట్ తప్పకుండా ఉండాలి. ఇక్కడ ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

Similar News