క్వారంటైన్ కేంద్రంలో మహిళ ప్రసవం

క్వారంటైన్ కేంద్రంలో 13 రోజులుగా ఉంటున్న ఓ వలస మహిళ కూలీ ప్రసవించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాలకొండ‌లో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన సదరు మహిళ కూలీ పనుల కోసం శ్రీకాకులం జిల్లాకు వలస వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో సొంత ఊరికి వెళ్లలేక పాలకొండ క్వారంటైన్ కేంద్రంలో ఉంటుంది. ఆమెకు తొమ్మిది నెలలు నిండడంతో శ్రీకాకుళం జనరల్ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆమె ఆడబిడ్డకు ప్రసవించింది. విషయం తెలుసుకున్న జిల్లా […]

Update: 2020-04-11 22:59 GMT

క్వారంటైన్ కేంద్రంలో 13 రోజులుగా ఉంటున్న ఓ వలస మహిళ కూలీ ప్రసవించింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాలకొండ‌లో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన సదరు మహిళ కూలీ పనుల కోసం శ్రీకాకులం జిల్లాకు వలస వచ్చింది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడంతో సొంత ఊరికి వెళ్లలేక పాలకొండ క్వారంటైన్ కేంద్రంలో ఉంటుంది. ఆమెకు తొమ్మిది నెలలు నిండడంతో శ్రీకాకుళం జనరల్ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఆమె ఆడబిడ్డకు ప్రసవించింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఆమెను పరామర్శించారు. ఆమెకు రూ. 25 వేలతో పాటు బేబీ కిట్‌ను అందజేశారు.

Tags: Pregnant, delivery, quarantine centre, srikakulam district

Tags:    

Similar News