ఆలయ ఉద్యోగులు, అర్చకులకు పీఆర్సీ వర్తింపు

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 30 శాతం పీఆర్సీని ఆలయ ఉద్యోగులకు, అర్చకులకు వర్తింపజేయనున్నట్లు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఉద్యోగులకూ పీఆర్సీని అమలుచేసే విధంగా నాన్ గెజిటెడ్ అధికారులు కమిషనర్‌కు విన్నపించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులతో జోనల్, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ల పరిధిలోని ఉద్యోగులు, అర్చకులందరికీ వేతనాలు పెరగనున్నాయి. పెంచిన వేతనాలు, […]

Update: 2021-08-26 07:44 GMT

దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 30 శాతం పీఆర్సీని ఆలయ ఉద్యోగులకు, అర్చకులకు వర్తింపజేయనున్నట్లు నిర్ణయించారు. ఈ మేరకు గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఉద్యోగులకూ పీఆర్సీని అమలుచేసే విధంగా నాన్ గెజిటెడ్ అధికారులు కమిషనర్‌కు విన్నపించినట్లు ఉత్తర్వుల్లో వివరించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉత్తర్వులతో జోనల్, డిప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్ల పరిధిలోని ఉద్యోగులు, అర్చకులందరికీ వేతనాలు పెరగనున్నాయి. పెంచిన వేతనాలు, ఏరియర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News