జాగ్రత్త!.. అలా చేస్తే అస్సలు స్పందించకండి.. వీసీ సజ్జనార్ ట్వీట్

సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తారు జాగ్రత్తగా ఉండాలి అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Update: 2024-04-29 12:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తారు జాగ్రత్తగా ఉండాలి అంటూ టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సైబర్ నేరగాళ్ల గురించి ప్రజలను అవేర్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో పోస్టు చేశారు. ఆ పోస్ట్ లో మోసగాళ్లు చాలా తెలివిగలవారని, వాళ్ల వలలో పడొద్దని చెప్పారు. అంతేగాక ఈ స్కామర్స్ చాలా తెలివిగా మీ వ్యక్తిగత వివరాలను చూడాలనుకుంటారని, దాని కోసం వారు మీతో స్క్రీన్ పంచుకోవాలని ఉందని అడుగుతారని, కానీ అలా చేయవద్దని సూచించారు. ఒకవేళ మీరు దానికి సుముఖత వ్యక్తం చేస్తే వారికి మీ ఇంటితాళాలు ఇచ్చినట్టేనని అన్నారు. మీ ఫేక్ వీడియోలు పంపి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారని, ధైర్యంగా ఉండి దానిపై రిపోర్టు చేయాలని చెప్పారు. ఇక ఈ పోస్టుపై అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు వీడియో కాల్స్ వస్తే స్పందించకండి. మీ వ్యక్తిగత వివరాలు షేర్ చేయకండి. వీడియో కాల్స్ కి స్పందిస్తే.. సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తారు.. జాగ్రత్త! అంటూ రాసుకొచ్చారు.

Similar News