ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్..సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు నేటితో ముగియనున్న గడువు

తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గురువారం ముగియనుంది.

Update: 2024-05-16 05:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గురువారం ముగియనుంది. ఇటీవల తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. మొదటగా మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్ష తేదీలు ప్రకటించారు. కానీ మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో తేదీల్లో మార్పులు చేసింది. 2024 ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగియనుంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.


Similar News