అమిత్ షా మార్ఫింగ్ వీడియోపై.. స్పందించిన కిషన్ రెడ్డి

ఇటివల సిద్ధిపేట సభలో పాల్గొన్న అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర నేతలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Update: 2024-04-29 12:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటివల సిద్ధిపేట సభలో పాల్గొన్న అమిత్ షా ప్రసంగాన్ని మార్ఫింగ్ చేసిన వీడియోను తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర నేతలు తమ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ నేతలు ఢిల్లీలో కేసు నమోదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసు అధికారులు సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. అలాగే మార్ఫింగ్ వీడియో పై పూర్తి వివరాలు తెలపాలని.. ఆ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ రికార్డు చేశారో తెలపాలని.. మే 1 ఢిల్లీకి విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.

కాగా సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడంపై.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇలాంటి చర్యలు పాల్పడిన వారిపై కఠిన నిర్ణయం తీసుకోవాలి. ఈ వీడియో ఒకటి, ప్రజల మధ్య అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. సాక్షాత్తు సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రికి చెందిన మార్ఫింగ్ వీడియోను అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మేము CM రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని కోర్టుకు లాగుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Read More...

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణ శివసేన పార్టీ మద్దతు 

Tags:    

Similar News