ప్రశ్నించే గొంతును గెలిపించాలి.. టీచర్లకు రేవంత్ లేఖ

ప్రజా సమస్యలపై పోరాడే వారినే చట్ట సభలకు పంపాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.

Update: 2023-03-09 16:54 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:  ప్రజా సమస్యలపై పోరాడేందుకు ప్రశ్నించే గొంతుల సంఖ్యను చట్ట సభలో పెంచాల్సిన అవసరం ఉన్నదని టీపీసీసీ చీఫ్రే వంత్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జి.హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ మేరకు ఆయన గురువారంఎమ్మెల్సీ ఓటర్లకు బహిరంగ లేఖను రాశారు.

హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర కారణంగా ఓటర్లను నేరుగా కలవలేకపోతున్నానని , కానీ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడే హర్షవర్ధన్ రెడ్డిని తప్పనిసరిగా గెలిపించాలని రిక్వెస్ట్ చేశారు. బీఆర్​ఎస్​ప్రభుత్వం ఉపాధ్యాయులను నిత్యం మోసం చేస్తూనే ఉన్నదని , డీఏ, జీతాలు, పెన్షన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్​ పార్టీ మద్ధతిచ్చిన అభ్యర్ధిని గెలిపించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Tags:    

Similar News