తెలంగాణకు ప్రత్యేక హామీలు.. గాంధీభవన్‌లో తెలంగాణ మేనిఫెస్టో విడుదల

గాంధీభవన్‌లో కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్‌తో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలతో మేనిఫెస్టోను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

Update: 2024-05-03 07:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీభవన్‌లో జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్‌తో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలతో తెలంగాణ మేనిఫెస్టోని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్, దానం నాగేందర్, రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి లేకుండా తెలంగాణ మేనిఫెస్టో ప్రకటన చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నామినేషన్‌లో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాయబరేలి వెళ్లారు. దీంతో ఆయన మేనిఫెస్టో విడుదలకు హాజరుకాలేదు. 

తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు

1. హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్ట్ పునఃప్రారంభం.

2. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పక్కనుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు.

3. భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు అయినా ఏటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం, పిచుకలపాడులు తిరిగి తెలంగాణలో విలీనం.

4. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా

5. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు

6. నూతన ఎయిర్ పోర్టుల ఏర్పాటు

7. రామగుండం- మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు

8. నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు

9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు

10. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు

11. జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు.

12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటు.

13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటు.

14. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ) క్యాంపస్ ఏర్పాటు.

15. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు.

16. అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు.

17. 73 & 74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ.

18. ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు.

19. దిగువ తెలిపిన ఇండస్ట్రియల్ కారిడార్‌ల ఏర్పాటు.

a) హైదరాబాద్- బెంగళూరు ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్

b) హైదరాబాద్ - నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్

c) హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్.

d) హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్

9) సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు.

20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం (International Cultural and Entertainment Hub)

21. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా.

22. డ్రై పోర్టు ఏర్పాటు.

23. హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు

Tags:    

Similar News