అరెస్టులతో మమ్మల్ని ఆపలేరు : ఉత్తమ్

దిశ, స్టేషన్ ఘన్‌పూర్:  అక్రమ అరెస్టులతో మమ్మల్ని ఎవరూ ఆపలేరని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఛలో మల్లారం పిలుపు మేరకు మల్లారం వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదివారం జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఒక దళిత వ్యక్తి హత్యపై పరామర్శించడానికి బయలుదేరిన మమ్మల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. […]

Update: 2020-07-26 05:41 GMT

దిశ, స్టేషన్ ఘన్‌పూర్: అక్రమ అరెస్టులతో మమ్మల్ని ఎవరూ ఆపలేరని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఛలో మల్లారం పిలుపు మేరకు మల్లారం వెళ్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదివారం జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలంలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ… ఒక దళిత వ్యక్తి హత్యపై పరామర్శించడానికి బయలుదేరిన మమ్మల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. మల్లారంలో ఒక దళిత వ్యక్తి హత్యపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా అధికార పార్టీ నేతలు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న తమను మార్గం మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను రఘునాథపల్లి పోలీసులు అరెస్టు చేయడం పట్ల మండిపడ్డారు. సీఎం కేసీఆర్ పరిపాలనలో దళిత గిరిజనలపై అత్యాచారం, హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. 2014 నుంచి దళితుడిని, దళిత గిరిజనులను అధికారంలోకి తీసుకువచ్చే క్రమంలో ముందు వరుసలో ఉండి తాను పనిచేశానన్నారు. కానీ దళితుడిని సీఎం చేస్తానని, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రంలోనే అతిపెద్ద సామాజిక వర్గమైన దళిత వర్గానికి కనీసం క్యాబినెట్‌లో స్థానం కూడా కల్పించలేదన్నారు. దళితుల పట్ల కేసీఆర్ వైఖరిని అందరూ ఆలోచించాలని, ఈ ఆరేళ్లలో అనేక సందర్భాల్లో దళితులపై జరిగిన దాడులని కేసీఆర్ ప్రభుత్వం ఎన్నడూ స్పందించలేదన్నారు. ప్రస్తుఈ దాడి వెనుక టీఆర్ఎస్ నేతలు కీలకంగా ఉన్నారన్నారు.

Tags:    

Similar News