బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ 

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. బండి సంజయ్‌ను తరిలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. దీంతో ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల అరెస్టుపై పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. Read Also… […]

Update: 2020-09-11 02:19 GMT

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చలో అసెంబ్లీకి బీజేపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అనంతరం ఆయనను గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. బండి సంజయ్‌ను తరిలిస్తున్న పోలీసు వాహనానికి బీజేపీ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. దీంతో ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ నేతల అరెస్టుపై పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Read Also…

HYD అభివృద్ధికి రూ.30వేల కోట్లు

Full View

Tags:    

Similar News