చెన్నైలో ఉద్రిక్తత…2వేల మంది అరెస్టు

దిశ, వెబ్ డెస్క్: చెన్నైలో పీఎంకే పార్టీ చేపట్టిన రైల్, రాస్తా రోకోలు ఉద్రిక్తతకు దారి తీశాయి. చెన్నైలోని పెరుంగళత్తూర్‌లో రైళ్లపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఇప్పటి వరకు సుమారు 2 వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. పన్నియర్ కులస్తులకు విద్య, ఉపాధిలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పీఎంకే పార్టీ ఆధ్వర్యంలో రైల్, రాస్తారోకో నిర్వహిస్తున్న సంగతి […]

Update: 2020-12-01 06:32 GMT

దిశ, వెబ్ డెస్క్: చెన్నైలో పీఎంకే పార్టీ చేపట్టిన రైల్, రాస్తా రోకోలు ఉద్రిక్తతకు దారి తీశాయి. చెన్నైలోని పెరుంగళత్తూర్‌లో రైళ్లపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.ఇప్పటి వరకు సుమారు 2 వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. పన్నియర్ కులస్తులకు విద్య, ఉపాధిలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పీఎంకే పార్టీ ఆధ్వర్యంలో రైల్, రాస్తారోకో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News