కొత్త సైబర్ చట్టం అమలుపై కేరళ యూటర్న్

తిరువనంతపురం: కేరళ పోలీసు చట్ట సవరణను అమలు చేయడంపై పినరయి విజయన్ సర్కారు యూటర్న్ తీసుకుంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చేసిన చట్ట సవరణను అమలు చేయవద్దని నిర్ణయించినట్టు కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. సీపీఎం కార్యవర్గ సమావేశానంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సవరణను ప్రకటించిన తర్వాత భిన్నాభిప్రాయాలు, ఆరోపణలు వచ్చాయని, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను సంప్రదించిన తర్వాత ఈ సవరణను వెనక్కి తీసుకోవడానికి నిర్ణయించినట్టు […]

Update: 2020-11-23 05:03 GMT

తిరువనంతపురం: కేరళ పోలీసు చట్ట సవరణను అమలు చేయడంపై పినరయి విజయన్ సర్కారు యూటర్న్ తీసుకుంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే ఐదేళ్ల జైలు శిక్ష విధించేలా చేసిన చట్ట సవరణను అమలు చేయవద్దని నిర్ణయించినట్టు కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. సీపీఎం కార్యవర్గ సమావేశానంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సవరణను ప్రకటించిన తర్వాత భిన్నాభిప్రాయాలు, ఆరోపణలు వచ్చాయని, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను సంప్రదించిన తర్వాత ఈ సవరణను వెనక్కి తీసుకోవడానికి నిర్ణయించినట్టు వివరించారు. సోషల్ మీడియాలో విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవడానికే సర్కారు ఈ సవరణ చేసిందని, చట్టం లేకున్నా.. అలాంటి అభ్యంతరకర చర్యలకు ప్రతిఒక్కరు దూరంగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News