ఓట్ల లెక్కింపు వేళ ఈవీఎంలపై నిఘాకు చెక్‌లిస్ట్.. రిలీజ్ చేసిన సిబల్

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల ప్రక్రియపై దేశ ప్రజల్లో అనుమానాలను రేకెత్తించడానికి కొందరు కుట్ర చేశారని చీఫ్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-05-26 17:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల ప్రక్రియపై దేశ ప్రజల్లో అనుమానాలను రేకెత్తించడానికి కొందరు కుట్ర చేశారని చీఫ్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే కీలక పరిణామం చోటుచేసుకుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు వేళ ఈవీఎంలను వేరిఫై చేసుకునేందుకు అవసరమైన చెక్ లిస్టును రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆదివారం విడుదల చేశారు. లోక్‌సభ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సౌలభ్యం కోసమే దీన్ని రిలీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలను పెంచే దురుద్దేశం తనకు లేదని సిబల్ స్పష్టంచేశారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా తాను విడుదల చేసిన చెక్ లిస్టును వాడుకొని ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా ? లేదా ? అనే దానిపై ఒక ధ్రువీకరణకు రావచ్చన్నారు.

తెరిచే టైం కీలకం..

‘‘జూన్ 4న ఏ టైంలో ఈవీఎం తెరవబడుతుందనే విషయం దానికి సంబంధించిన కంట్రోల్ యూనిట్ (సీయూ)పై రాసి ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో కాకుండా మరో టైంలో ఈవీఎంను తెరిస్తే.. సందేహించి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చు. ఈవిధమైన తేడా వచ్చినప్పుడు.. అంతకుముందే మరేదైనా చోట ఈవీఎంను తెరిచి ఉంటారని అనుమానించాలి’’ అని కపిల్ సిబల్ పేర్కొన్నారు. ‘‘కంట్రోల్ యూనిట్‌కు చెందిన క్రమ సంఖ్య, రాతపూర్వక ఫార్మాట్‌లో ప్రస్తావించిన క్రమ సంఖ్య రెండో సరిపోలేలా ఉన్నాయా.. లేదా .. అనేది కౌంటింగ్ ఏజెంట్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు చెక్ చూసుకోవాలి. మొత్తం పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో వచ్చిన ఓట్లలో హెచ్చుతగ్గులు ఉంటే సందేహించి అధికారులతో వెరిఫికేషన్ చేయించుకోవాలి’’ అని ఆయన సూచించారు.

Tags:    

Similar News