Petrol & Diesel : వాహనదారులకు గుడ్ న్యూస్.. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్?

దిశ, డైనమిక్ బ్యూరో : రోజు రోజుకూ పెరిగిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు సతమతమవుతున్న నేపథ్యంలో కేంద్రం వారికి శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై శుక్రవారం జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో కొంత కోల్పోవడానికి ఒప్పుకుంటే పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకొస్తారు. వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో […]

Update: 2021-09-14 23:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రోజు రోజుకూ పెరిగిపోతున్న ఇంధన ధరలతో వాహనదారులు సతమతమవుతున్న నేపథ్యంలో కేంద్రం వారికి శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై శుక్రవారం జరగనున్న జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో కొంత కోల్పోవడానికి ఒప్పుకుంటే పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీలోకి తీసుకొస్తారు. వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో సహా ఫిక్స్‌డ్‌ సర్‌ఛార్జి ఉండే అవకాశముంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గి వాహనదారులకు కొంత ఉపశమనం కలుగుతుంది.

Tags:    

Similar News