కరీంనగర్‌లో పరిహారం కోసం సబ్ స్టేషన్ కు తాళం

దిశ, కరీంనగర్: విద్యుత్ అధికారుల నిర్లక్షం కారణంగా తన గేదె చనిపోయినందున పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి సబ్ స్టేషన్ కు తాళం వేశాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన తిరుపతిరావుకు చెందిన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతిచెందింది. విద్యుత్ వైరు తెగి వాగులో పడిందని.. ఈ సమయంలో నీరు తాగడానికి ఆ వాగులోకి వెళ్లిన తన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిదని […]

Update: 2020-06-19 02:44 GMT

దిశ, కరీంనగర్: విద్యుత్ అధికారుల నిర్లక్షం కారణంగా తన గేదె చనిపోయినందున పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి సబ్ స్టేషన్ కు తాళం వేశాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లోకపేట గ్రామానికి చెందిన తిరుపతిరావుకు చెందిన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతిచెందింది. విద్యుత్ వైరు తెగి వాగులో పడిందని.. ఈ సమయంలో నీరు తాగడానికి ఆ వాగులోకి వెళ్లిన తన గేదె విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిదని బాధితుడు తెలిపారు. తనకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సబ్ స్టేషన్ కు తాళం వేసి అక్కడే బైఠాయించాడు. తాము అప్రమత్తం అయ్యామని.. లేకపోతే 20కి పైగా గేదెలు చనిపోయేవని వివరించారు.

Tags:    

Similar News