స్కూటీలో వైన్స్ షాపు.. ‘పుష్ప’ రేంజ్‌లో వృద్ధుడు చేసిన పనికి పోలీసులు షాక్ (వీడియో)

‘పుష్ప’ సినిమాలో అల్లుఅర్జున్ ఎర్ర చందనం దుంగలను తరలించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ వేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటాడు.

Update: 2024-05-03 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ‘పుష్ప’ సినిమాలో అల్లుఅర్జున్ ఎర్ర చందనం దుంగలను తరలించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ వేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటాడు. సేమ్ అలాంటి సీనే ఏపీలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన గోపయ్య అనే వృద్ధుడు తెలంగాణ నుంచి ఏపీకి మద్యాన్ని దర్జాగా స్కూటీలో తరలిస్తూ అమ్ముకుంటూ వ్యాపారాన్ని పుష్ప రేంజ్ లో కొనసాగిస్తున్నాడు. కాగా, మద్యం తరలిస్తున్నాడు అంటే ఢిక్కీలో ఉంచి తరలిస్తున్నాడు అనుకుంటే పొరపాటే.. స్కూటీ పార్ట్స్‌లో ఏకంగా 100 క్వార్టర్లను జాగ్రత్తగా అమర్చి తరలిస్తున్నాడు. అయితే వృద్ధుడి ప్లాన్‌కు పోలీసులు షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Similar News