ఇబ్రహీంపూర్ అడవిలో చిరుత సంచారం.. అటవీ శాఖ హెచ్చరిక ఇదే..!

చేగుంట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగరాణి తెలిపారు.

Update: 2024-05-03 06:03 GMT

దిశ, చేగుంట : చేగుంట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తుందని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నాగరాణి తెలిపారు. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ నర్సరీలో చిరుత పులి ఆనవాలు చిక్కాయి. ఇబ్రహీంపూర్ అడవిలోకి తునికి ఆకు తీసుకురావడానికి గాని, వేరే ఏ అవసరాలకు గాని ఎవరు కూడా వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ పరిధిలోని ఇబ్రహీంపూర్, బోనాల, గోవిందా పూర్, కిష్టాపూర్, పులిమామిడి, చిట్టోజ్ పల్లి, రుక్మాపూర్, రాంపూర్, కన్యారం గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండి అడవిలో ఎవరూ వెళ్ళద్దని కోరారు. ఎంతటి అవసరమున్న ఇబ్రహీంపూర్ ఫారెస్ట్ ఏరియాలోకి ఎవరు పోకూడదనీ, అటవీ ప్రాంతంలో ఏదైనా జరిగితే అటవీశాఖ సంబంధం లేదని ఫారెస్ట్ ఆఫీసర్ నాగరాణి పేర్కొన్నారు.

Similar News