గ్రేటర్‎లో వ్యూహ్మాత్మక ప్రచార జోరు

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తుండ‌డంతో అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనుండడంతో ఆయా పార్టీలు బ‌స్తీలు, కాల‌నీల్లో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముందుగానే మ‌రుస‌టి రోజు ప్ర‌చారం నిర్వ‌హించే బ‌స్తీలు, కాల‌నీలు ఎంపిక చేసి ఉద‌యం చ‌లిని సైతం లెక్క చేయ‌కుండా ఓట‌ర్ల‌ను క‌లిసేందుకు వెళ్తున్నారు. దీంతో బస్తీల్లో ఉద‌యం నుంచే సందడిగా కనబడుతోంది. ఇక ప్ర‌చారంలో పాల్గొనే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లకు కార్యాల‌యాల వ‌ద్ద‌నే టిఫిన్, టీలు ఏర్పాటు […]

Update: 2020-11-24 09:36 GMT

దిశ ప్ర‌తినిధి, హైద‌రాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తుండ‌డంతో అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనుండడంతో ఆయా పార్టీలు బ‌స్తీలు, కాల‌నీల్లో ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నాయి. ముందుగానే మ‌రుస‌టి రోజు ప్ర‌చారం నిర్వ‌హించే బ‌స్తీలు, కాల‌నీలు ఎంపిక చేసి ఉద‌యం చ‌లిని సైతం లెక్క చేయ‌కుండా ఓట‌ర్ల‌ను క‌లిసేందుకు వెళ్తున్నారు. దీంతో బస్తీల్లో ఉద‌యం నుంచే సందడిగా కనబడుతోంది. ఇక ప్ర‌చారంలో పాల్గొనే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లకు కార్యాల‌యాల వ‌ద్ద‌నే టిఫిన్, టీలు ఏర్పాటు చేసి స‌మ‌యం వృథా కాకుండా చూసుకుంటున్నారు.

అపార్ట్‎మెంట్ల వైపు అభ్య‌ర్థుల చూపు..

ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఆరు రోజుల గ‌డువు మిగిలి ఉండ‌డంతో ఆయా పార్టీలు ప్ర‌చారంలో వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నాయి. బ‌హుళ అంత‌స్థుల అపార్ట్‎మెంట్లను ఎంపిక చేసుకుని అభ్యర్థులు ప్ర‌చారం కొన‌సాగిస్తున్నారు. గ్రేట‌ర్ ప‌రిధిలోని ప్ర‌తి డివిజ‌న్‎లో సుమారు 40 నుంచి 60 వేల ఓట్ల వ‌ర‌కు ఉంటున్నాయి. ఎన్నికలకు ఉన్న తక్కువ సమయంలోనే వీలైనంత ఎక్కువ ఓట‌ర్ల‌ను క‌లిసి త‌మ‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు. కొన్ని అపార్ట్‎మెంట్ల‌లో వంద‌ల సంఖ్య‌లో ఓట‌ర్లు ఉండ‌డ‌ంతో వారిని కలిసేందుకు చూస్తున్నారు. కాగా, అభ్యర్థులు ప్ర‌చారానికి వెళ్లే ముందు అపార్ట్‎మెంట్ పాల‌క వ‌ర్గానికి చెప్పి అంద‌రిని ఒకే దగ్గరికి చేర్చి ప్రచారం చేపడుతున్నారు. ఆయా అపార్ట్‎మెంట్ల‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను తాము ప‌రిష్క‌రిస్తామ‌ని హామీలు ఇస్తున్నారు.

ప్ర‌చారానికి ప‌క్కా ప్లాన్..

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లై పోలింగ్‎కు రెండు వారాల గ‌డువు కూడా లేక‌పోవ‌డం డివిజ‌న్ల‌లో కార్పొరేట‌ర్ అభ్య‌ర్థుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తోంది. గ‌తంలో నోటిఫికేష‌న్ జారీ అయిన త‌ర్వాత పోలింగ్‎కు క‌‌నీసం నెల రోజుల వ్య‌వ‌ధి ఉండేది. అయితే ఈసారి అంత స‌మ‌యం లేకపోవడంతో అభ్యర్థులను ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తోంది. దీంతో బ‌స్తీ పెద్ద‌ల‌ను, కాల‌నీ సంఘాల‌ను క‌లిసి త‌మ సామాజిక వ‌ర్గం ప్ర‌జ‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నారు.

ర‌కర‌కాలుగా ప్ర‌చార హోరు..

ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు వివిధ రకాలుగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. కళాకారులతో త‌మ పేర్ల‌తో పాట‌ల‌ను పాడిస్తూ రికార్డులు చేయిస్తున్నారు. ఇలా రికార్డు చేసిన పాట‌ల‌ను ప్ర‌చార ర‌థాల ద్వారా బ‌స్తీలు, కాల‌నీల‌లో తిప్పుతూ ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. అంతే కాకుండా త‌మ‌కు న‌మ్మ‌క‌స్తులైన‌, అనుకూలస్తులైన వారికి ప్ర‌చార బాధ్య‌త‌లు అప్ప‌గించి వీలైనంత ఎక్కువ మంది ఓట‌ర్ల‌ను క‌లిసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News