మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్!

దిశ, వెబ్‌డెస్క్: చమురు ధరలు వరుసగా నాలుగు రోజూ తగ్గాయి. నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో ఆయిల్ కంపెనీలు 18 నుంచి 20 పైసల వరకూ చమురు ధరలను తగ్గించాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర గతేడాది సెప్టెంబర్ తర్వాత రూ. 71 దిగువకు వచ్చింది. డీజిల్ కూడా గతేడాది జనవరి ధరల స్థాయికి తగ్గింది. గడిచిన నాలుగు రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ ధర 61 పైసల వరకూ తగ్గింది. డీజిల్ లీటర్‌కు 51 పైసల మేర […]

Update: 2020-03-08 07:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: చమురు ధరలు వరుసగా నాలుగు రోజూ తగ్గాయి. నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో ఆయిల్ కంపెనీలు 18 నుంచి 20 పైసల వరకూ చమురు ధరలను తగ్గించాయి. రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర గతేడాది సెప్టెంబర్ తర్వాత రూ. 71 దిగువకు వచ్చింది. డీజిల్ కూడా గతేడాది జనవరి ధరల స్థాయికి తగ్గింది.

గడిచిన నాలుగు రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ ధర 61 పైసల వరకూ తగ్గింది. డీజిల్ లీటర్‌కు 51 పైసల మేర తగ్గింది. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గడం వల్ల దేశీయంగా ఇంధన ధరలు తగ్గుతూ రావడంతో వినియోగదారులు సంతృప్తిగా ఉన్నారు.

ఆయిల్ కంపెనీలు ఆదివారం ఢిల్లీ, కలకత్తాల్లో పెట్రోల్ ధరను లీటర్‌కు 19 పైసలు తగ్గించాయి. ముంబైలో 18 పైసలు, చెన్నైలో 20 పైసలు తగ్గించాయి. డీజీల్ కూడా లీటర్‌కు ఢిల్లీ, కోల్‌కతాల్లో 18 పైసలు, ముంబైలో 19 పైసలు, చెన్నైలో 20 పైసలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీల సమాచారం ప్రకారం..ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ. 70.83, కోల్‌కత్తాలో రూ. 73.51, ముంబైలో రూ. 76.53, చెన్నైలో రూ. 73.58గా ఉంది. ఇక నాలుగు మెట్రో నగరాల్లో డీజిల్ ధర లీటర్‌కు రూ. ఢిల్లీలో రూ. 63.51, కోల్‌కత్తాలో రూ. 65.84, ముంబైలో రూ. 66.50, చెన్నైలో రూ. 67.01గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం బ్రెంట్ ముడిచమురు ధరలు సుమారు 9 శాతం పడిపోయాయి. ఈ క్షీణత 2008, డిసెంబర్ స్థాయికి తగ్గడం గమనార్హం. ఈ ఏడాదిలో బ్రెంట్ ముడి చమురు ధరలు 37 శాతం పడిపోయాయి. 2020, జనవరిలో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 71.75 ఉండగా, శుక్ర్వారం బ్యారెల్‌కు 45.19కి పడిపోయింది.

tags: crude oil, Delhi fuel price, Diesel price, mumbai fuel price, Oil prices, petrol diesel prices, Petrol price

Tags:    

Similar News