మోడీ హయాంలో ఉద్యోగాల సృష్టి రికార్డు స్థాయిలో ఉంది: ఆర్థికవేత్త సూర్జిత్ భల్లా

భారత ప్రధాని మోడీ హయాంలో గత 7-8 సంవత్సరాలలో దేశంలో ఉద్యోగాల కల్పన రికార్డు స్థాయిలో ఉందని IMF మాజీ భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్జిత్ భల్లా ఆదివారం అన్నారు

Update: 2024-05-05 10:32 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ప్రధాని మోడీ హయాంలో గత 7-8 సంవత్సరాలలో దేశంలో ఉద్యోగాల కల్పన రికార్డు స్థాయిలో ఉందని IMF మాజీ భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూర్జిత్ భల్లా ఆదివారం అన్నారు. 2004-2013 (యూపీఏ ప్రభుత్వ కాలం)లో అతి తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించారని, కానీ మోడీ ప్రభుత్వం దాదాపు కోటి ఉద్యోగాలను కొత్తగా సృష్టించారని తెలిపారు. భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సగటు ప్రాతిపదికన ఉద్యోగాల సృష్టి అధికంగా ఉందని, అటల్ బిహారీ వాజ్‌పేయి, మోడీ హాయంలో గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలు సృష్టించబడ్డాయని సూర్జిత్ భల్లా పేర్కొన్నారు.

ఇటీవల అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) నివేదిక భారత్‌లో మొత్తం నిరుద్యోగ జనాభాలో నిరుద్యోగ యువత వాటా ఎక్కువగా ఉందని పేర్కొనగా, దీనికి ఆయన స్పందిస్తూ, 29 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు కలిగిన యువతను పరిశీలిస్తే, ఇది నిజంగా నిరుద్యోగ రేటు కంటే ఎక్కువ కాదని అన్నారు. యువత మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారు.కాబట్టి, ప్రపంచంలోని ప్రతి చోట, యువతలో ఘర్షణాత్మక నిరుద్యోగం ఎక్కువగా ఉందని భల్లా పేర్కొన్నారు. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మందగించడానికి ముఖ్య కారణం ప్రభుత్వ కొత్త పాలసీ అని, పెట్టుబడికి సంబంధించిన వివాదం ఉంటే, దానిని ప్రభుత్వం పరిష్కరించాలని ఆర్థికవేత్త సూచించారు. అలాగే, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సొంతంగా 330-350 సీట్లు వచ్చే అవకాశం ఉందని భల్లా అంచనా వేశారు.

Similar News