శనివారం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌.. 74 వేల పాయింట్లు దాటిన సెన్సెక్స్

సాధారణంగా శనివారం స్టాక్‌మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ మే 18న ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ నిర్వహించారు.

Update: 2024-05-18 14:35 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: సాధారణంగా శనివారం స్టాక్‌మార్కెట్లకు సెలవు ఉంటుంది. కానీ మే 18న ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ నిర్వహించారు. ఈ ట్రేడింగ్‌లో మార్కెట్లు రాణించాయి. ఇటీవల వరుసగా మూడు రోజుల నుంచి లాభాల్లో పయనించిన సూచీలు, అన్ని రంగాల్లో కొనుగోళ్లు జరగడంతో శనివారం కూడా లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 88.91 పాయింట్ల లాభంతో 74,005.94 వద్ద ముగిసింది. అదే సమయంలో నిఫ్టీ సైతం రాణించి 35.9 పాయింట్ల లాభంతో 22,502 పాయింట్లకు చేరుకుంది.

ఇటీవల కాలంలో వరుసగా అమ్మకాలకు దిగిన విదేశీ పెట్టుబడి దారులు శుక్రవారం నుంచి కొనుగోళ్లను ప్రారంభించడం మార్కెట్లకు కలిసొచ్చింది. నెస్లే ఇండియా లిమిటెడ్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలు శనివారం నిర్వహించిన ట్రేడింగ్‌లో లాభాలను సాధించగా, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్ నష్టాలను నమోదు చేశాయి. సైట్‌లో ఏమైనా లోపాలు వచ్చినట్లయితే వాటిని ఎదుర్కొడానికి ముందస్తు సన్నద్ధతగా ఈ శనివారం ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహించారు.

Similar News