మీరు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌లా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారా?

దిశ,వెబ్‌డెస్క్: మీరు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌లా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి అంటూ పాక్ కమెడియన్ అక్బర్ చౌదరి ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో మూడు పద్దతుల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో మాంచి కామెడీ టైమింగ్ తో వీడియోను క్రియేట్ చేశాడు. మొదటి దశలో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేయగా వచ్చిన పొడిని వాటర్ లో కలుపుకొని తాగాలి. ఆ తర్వాత రెండో దశలో అదే డిక్షనరీని […]

Update: 2021-03-01 04:33 GMT

దిశ,వెబ్‌డెస్క్: మీరు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌లా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి అంటూ పాక్ కమెడియన్ అక్బర్ చౌదరి ఓ వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో మూడు పద్దతుల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో మాంచి కామెడీ టైమింగ్ తో వీడియోను క్రియేట్ చేశాడు.

మొదటి దశలో ఆక్స్ ఫర్డ్ డిక్షనరీని మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేయగా వచ్చిన పొడిని వాటర్ లో కలుపుకొని తాగాలి. ఆ తర్వాత రెండో దశలో అదే డిక్షనరీని సెలైన్ బాటిల్ లా ఎక్కించుకోవాలి. మూడో దశలో దంచి మెత్తగా పొడి చేయాలి. ఆ తర్వాత ఇండియన్ కరెన్సీని పొడి చేసుకొని పీల్చాలి’ అంటూ వీడియోను అప్ లోడ్ చేశాడు. ఒకవేళ ఇన్ని చేసిన తర్వాత కూడా శశిథరూర్ లా మాట్లాడలేకపోతే ఏం చేయాలో చెప్పాడు. నేర్చుకుంటే వస్తుందని, కాదంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం శశిథరూర్ ను అనుకరించడమే కాదు ఆయనలా మాట్లాడడం నేర్చుకోవాలని హితువు పలికాడు

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కొందరైతే తాము ఈ వీడియో చూసిన తర్వాత పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్న ఎమోజీల్ని షేర్ చేస్తున్నారు. ఇండియన్స్ అయితే ఏకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఓ కామెడీ వీడియో చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇండియన్స్ రిక్వెస్ట్ పై పాక్ కమెడియన్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News