BREAKING: స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు.. హైకోర్టు‌లో పిటిషన్ దాఖలు చేసిన జనసేన

సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-04-30 06:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయంతో కూటమి అభ్యర్థుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఈ మేరకు జనసేన పోటీలో లేని పలు శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తు కేటాయించింది. టీదేపా, బీజపాతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. అయితే ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో అదే గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది.స

ప్రస్తుతం ఈ అంశంపై జనసేన నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ.. జనసేన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. కేసులో ఇంప్లీడ్ అవుతూ.. టీడీపీ కూడా అనుబంధ పిటిషన్‌ను దాఖలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు గాజుగ్లాస్ కేటాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. జనసేన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుపై స్పందించిన సీఈసీ గుర్తు విషయంలో 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.

Tags:    

Similar News