ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఇటీవలే నూతన ఎస్ఈసీ నియామకం కోసం ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ పంపింది. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ హరిచందన్ ఆమోద ముద్రవేశారు. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నీలం సాహ్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా […]

Update: 2021-03-26 09:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఏపీ ప్రభుత్వం ఇటీవలే నూతన ఎస్ఈసీ నియామకం కోసం ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ పంపింది. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ హరిచందన్ ఆమోద ముద్రవేశారు. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నీలం సాహ్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు.

ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్నారు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టనున్నారు. ఇకపోతే ఈ పదవి కోసం విశ్రాంత ఐఏఎస్‌ అధికారులు నీలం సాహ్ని, శామ్యూల్‌, ప్రేమచంద్రారెడ్డిల పేర్లు పరిశీలనకు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News